Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎస్కే కోచ్‌ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్

సీఎస్కే కోచ్‌ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్ 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో..

ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఎంపికపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్‌ను నియమించడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే తొందరెందుకని తెలిపాడు.

'సీఎస్కే జట్టుకు హెడ్ కోచ్ ఉంటాడు. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి హెడ్ కోచ్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తొందరేం లేదు' అని రుతురాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 2008లో సీఎస్కే ప్లేయర్‌గా జట్టులో చేరాడు. ఆ తర్వాతి ఏడాదే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్‌లో జట్టు ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది.

బాధ్యత పెరిగింది..

ధోని నుంచి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రుతురాజ్‌.. గతేడాది తన జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. 'ఎంఎస్‌ ధోని నుంచి కెప్టెన్సీ తీసుకోవడం చాలా పెద్ద బాధ్యత. అతడు సాధించిన విజయాలు ఎంతో గొప్పవి. సహజంగానే అభిమానులు మరిన్ని విజయాలు, టైటిళ్లను ఆశిస్తారు. అయితే ఈ అదనపు బాధ్యతను నేను ఆస్వాదిస్తున్నా. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం కెప్టెన్‌గా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నా. 2008 నుంచి సీఎస్కే అద్భుతమైన ప్రయాణం సాగించింది. దాదాపు ప్రతి సైకిల్‌లోనూ ఐపీఎల్‌ ట్రోఫీని సాధించాం. ఇంతటి స్థిరత్వాన్ని సాధించిన ఫ్రాంచైజీలు చాలా తక్కువ. గొప్ప విజయాల సమయంలో అభిమానులు మాకు అండగా నిలిచారు. ఇప్పుడు సీఎస్కే కష్టకాలంలో ఉంది. ఇప్పుడు కూడా అదే మద్దతును అభిమానులు అందించాలి' అని రుతురాజ్‌ వెల్లడించాడు.

strong>

అఫ్గాన్ సిరీస్‌కు నో ఛాన్స్: ఆశ చావలేదు.. కృనాల్ పాండ్య పోస్ట్ వైరల్!

బాబర్ ఆజమ్‌కు జ్వరం.. పాక్ జట్టులో మరింత గందరగోళం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy