Dailyhunt
ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్..

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఐఫోన్ వినియోగదారుల కోసం ఓ ప్రముఖ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న 'డ్యూయల్ అకౌంట్' ఫీచర్ ఇకపై ఐఫోన్లలో కూడా పని చేయబోతోంది.

ఐఫోన్ యూజర్లు తమ మొబైల్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను నిర్వహించుకోవచ్చు. దీనివల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన చాట్లను వేరుగా ఉంచుకోవడం సులభతరం కానుంది (WhatsApp new feature iPhone).

అలాగే, ఫొటో ఎడిటింగ్, మెసేజ్ డ్రాఫ్టింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లనూ వాట్సాప్ తీసుకొచ్చింది. వినియోగదారులు ఇకపై మెటా ఏఐ ఉపయోగించి ఫొటోలను టచప్ చేయడం, అనవసరమైన అంశాలను తొలగించడం, బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, ఫొటో పంపే ముందు వివిధ స్టైల్స్ వాడడం వంటివి చేయవచ్చు. అలాగే సంభాషణ సందర్భాన్ని బట్టి సమాధానాలు ఇవ్వడానికి కూడా 'ఏఐ రైటింగ్ హెల్ప్' ఫీచర్ సహాయపడుతుంది (Two WhatsApp accounts one phone).

మెటా ఏఐ టూల్స్ ఉపయోగించినప్పటికీ భద్రతా పరమైన సమస్యలు తలెత్తవని, వినియోగదారుల చాట్‌లు పూర్తి ప్రైవేట్‌గా ఉంటాయని వాట్సాప్ తెలిపింది (Meta AI WhatsApp). అయితే ఈ మెటా ఏఐ ఫీచర్లు వినియోగదారులకు వెంటనే అందుబాటులోకి రాకపోవచ్చని పేర్కొంది. అలాగే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఒకరికొకరు తమ డేటాను మార్చుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.


మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..

ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy