Dailyhunt
ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

రాన్‌పై అనుకున్న సమయం కంటే ముందే దాడులను ముగిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. మరికొన్ని వారాల్లో ఇరాన్ యుద్ధం ముగుస్తుందని తెలిపారు.

ఇరాన్‌పై భూతల దాడులు చేయాల్సిన అవసరం లేకుండానే తమ లక్ష్యాలను సాధిస్తామని అన్నారు. తమ దాడులు మరో రెండు, మూడు వారాల్లో పూర్తవుతాయని, అప్పటికి టెహ్రాన్ పూర్తిగా బలహీనపడుతుందని పేర్కొన్నారు (Marco Rubio statement).

ఫ్రాన్స్‌లో జీ-7 ప్రతినిధులతో సమావేశమైన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రుబియో మాట్లాడారు. 'హోర్ముజ్‌లో జరిగే చమురు రవాణాపై ఇరాన్ సుంకాలు విధించకుండా నిరోధించడమే మా తక్షణ కర్తవ్యం. ఆ సుంకాల వల్ల అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం ముగింపుపై చర్చల కోసం ఇరాన్ పాలకవర్గం మాకు సందేశాలు పంపింది. అయితే మేం ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు' అని రుబియో తెలిపారు (US Iran strategy).

పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును ఇటీవల భారీగా పెంచిన సంగతి తెలిసిందే (US defense policy). ఈ విషయంపై కూడా రుబియో మాట్లాడారు. 'ఇరాన్‌పై భూతల దాడులు చేయాలని మేం అనుకోవడం లేదు. కానీ, అత్యవసర పరిస్థితులు తలెత్తితే మాత్రం భూతల దాడులకు దిగక తప్పదు. అందుకే అమెరికా దళాలు ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నాయి' అని రుబియో స్పష్టం చేశారు.

ఈ వార్తలూ చదవండి:

వామ్మో.. పానీ పూరీ వాలా! ఇతడి ముందు టెకీలు కూడా దిగదుడుపే

విద్యార్థిని చితకబాదిన టీచర్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy