Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాల వేదికగా తలపడనుంది.

ఈ క్రమంలో టాస్ నెగ్గిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ జట్టును నడిపించనున్నాడు. కాగా ఈ పోరులో ఆర్సీబీ నెగ్గితే.. 18 పాయింట్లతో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలువనుంది. మరోవైపు పంజాబ్ ఓడితే.. ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు అయినట్లే!

పంజాబ్ కింగ్స్ తుది జట్టు

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కనోలీ, సూర్యాంశ్ షెడ్గె, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఓమర్‌జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, ఫెర్గుసన్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: స్టోయినిస్, బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్, ప్రవీణ్ దూబె

ఆర్సీబీ తుది జట్టు

జితేశ్ శర్మ(కెప్టెన్, వికెట్ కీపర్), బెథెల్, విరాట్ కోహ్లీ, పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రసిక్ సలామ్ దార్, జోర్డన్ కాక్స్, అభినందన్ సింగ్, స్వప్నిల్ సింగ్, కనిష్క్ చౌహాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy