Dailyhunt
ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్!

ఐపీఎల్ 2026: సన్ రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్!

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

ఈ సీజన్‌లో రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌ను ఓటమితో ఆరంభించాయి. ఆర్సీబీపై ఎస్ఆర్‌హెచ్, ముంబై పై కేకేఆర్ ఓటమి పాలయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి.. ఐపీఎల్ 2026 సీజన్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. చివరిసారిగా గతేడాది ఢిల్లీ వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. దీంతో నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు కేకేఆర్ సిద్ధం కాగా.. నాటి సీన్ రిపీట్ చేయాలనే కసితో ఎస్ఆర్‌హెచ్ ఉంది.

ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌కు మంచి రికార్డు ఉంటే.. ఎస్ఆర్‌హెచ్‌(Sunrisers Hyderabad)కు మాత్రం చెత్త రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ వేదికపై కేకేఆర్ మొత్తం 63 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో 35 గెలిచి 27 ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం తేల్లేదు. ఇదే స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి, కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అలానే ఐపీఎల్‌లో ఇరుజట్లు ముఖాముఖిగా 30 మ్యాచుల్లో తలపడ్డాయి. 19-10 తేడాతో కేకేఆర్ ఆధిక్యంలో ఉంది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరిసారిగా గతేడాది ఈ రెండు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడ్డాయి.

ఆ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదగా, మొత్తం 446 పరుగులు నమోదయ్యాయి. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏకంగా 278 పరుగులు చేయగా.. కేకేఆర్ 168 పరుగులకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్ ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చివరి ఐపీఎల్ మ్యాచ్, ఐపీఎల్ 2025లో భాగంగా 2025 మే 7న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders ), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్:

ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే.. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. అలానే బౌలర్లకు పిచ్ సహకరిస్తుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. వేసవి కావడంతో మంచు ప్రభావం చాలా తక్కువ. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుని అవకాశం ఉంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ప్లేయర్

షమీ సంచలనం.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక బౌలర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy