Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ వరుస పరాజయాల తర్వాత టీమిండియా రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

తాజాగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు జింబాబ్వేపై సిరీస్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో జింబాబ్వేపై 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత తిరిగి ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకుంది. టీమిండియా టాప్ ప్లేస్‌కు చేరుకున్నప్పటికీ ఇంగ్లండ్ కూడా 268 పాయింట్లతోనే కొనసాగుతుండటం విశేషం.

జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం..

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యాక టీమిండియాకు ఇదే తొలి సిరీస్ విజయం. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బ్యాట్‌తోనూ, బంతితోనూ ప్లేయర్లు అదరగొట్టారు. 219 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ పెట్టారు. ఛేదనలో ఆతిథ్య జట్టు జింబాబ్వేను 129 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 'ఈ విజయంతో చాలా సంతోషంగా ఉన్నా. ప్రతి విభాగంలోనూ మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అద్భుతంగా ఆడారు. వారు ఆడిన కొన్ని షాట్లు నిజంగా కనుల విందుగా అనిపించాయి. మొదట 180 నుంచి 200 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకున్నాం. కానీ 220 పరుగుల వరకు చేరడం అదనపు బోనస్‌లా మారింది. ఇక బౌలర్లు కూడా ఎప్పటిలాగే అద్భుతంగా బౌలింగ్ చేసి సరైన లైన్, లెంగ్త్‌తో ప్రత్యర్థిని 130 పరుగుల లోపే ఆలౌట్ చేశారు. ఇదొక పూర్తి స్థాయి జట్టు విజయం' అని అయ్యర్ పేర్కొన్నాడు.

strong>

కామన్వెల్త్ గేమ్స్‌లో షాకింగ్ ఘటన.. పట్టుతప్పి తలకిందులుగా పడిపోయిన జిమ్నాస్ట్

ఫిఫా ఫైనల్ తర్వాత తొలిసారి కనిపించిన మెస్సి.. వీడియో వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy