Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కామన్వెల్త్ గేమ్స్‌లో షాకింగ్ ఘటన.. పట్టుతప్పి తలకిందులుగా పడిపోయిన జిమ్నాస్ట్

కామన్వెల్త్ గేమ్స్‌లో షాకింగ్ ఘటన.. పట్టుతప్పి తలకిందులుగా పడిపోయిన జిమ్నాస్ట్

ఇంటర్నెట్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఇంగ్లండ్‌కు చెందిన యువ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్‌టన్‌కు పెను ప్రమాదం తప్పింది.

పురుషుల జట్టు జిమ్నాస్టిక్స్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హారిజంటల్ బార్‌పై ప్రదర్శన చేస్తూ పట్టుతప్పి తలకిందులుగా నేలపై పడిపోయాడు. వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి చేరుకుని చికిత్స అందించారు. తలకు బలమైన గాయం అవ్వడంతో అతడి తల, మెడకు ప్రత్యేక సపోర్ట్ అమర్చి స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్టేడియంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. దీంతో పోటీని కొంతసేపు నిలిపేశారు.

వరుసగా నాలుగోసారి కామన్వెల్త్ పురుషుల జట్టు టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు చివరి రొటేషన్‌లో ఈ ప్రమాదం ఎదురైంది. సహచరుడు తీవ్రంగా గాయపడినా ఇంగ్లండ్ జిమ్నాస్ట్‌లు ధైర్యంగా పోటీని పూర్తి చేశారు. చివరకు కెనడా స్వర్ణ పతకం సాధించగా, ఇంగ్లండ్ రజతంతో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

లాంగ్‌టన్ స్పృహలోనే ఉన్నాడని, వైద్యులతో మాట్లాడుతున్నాడని ఇంగ్లండ్ జట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. అనంతరం నిర్వహించిన పలు స్కాన్‌లలో ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవని తెలిపింది. వైద్య పరీక్షల ఫలితాలు సానుకూలంగా రావడంతో అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, టీమ్ ఇంగ్లండ్ వైద్య బృందం పర్యవేక్షణలో జట్టు హోటల్‌కు తరలించినట్లు పేర్కొంది. లాంగ్‌టన్ ఆస్పత్రిలో ఉండటంతో రజత పతకాలు స్వీకరించే వేడుకకు హాజరు కాలేకపోయాడు. అయితే త్వరలోనే జట్టుతో చేరి సహచరులతో కలిసి సంబరాలు జరుపుకోనున్నట్లు సమాచారం.

strong>

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy