Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అలా అయితే ఇప్పుడే ఆడించలేమని వైభవ్‌కు చెప్పండి: పార్థివ్ పటేల్

అలా అయితే ఇప్పుడే ఆడించలేమని వైభవ్‌కు చెప్పండి: పార్థివ్ పటేల్

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టులో అవకాశం దక్కించుకున్న వైభవ్‌కు..

ఇంకా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఐర్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత అతడిని ఆడించాల్సిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైభవ్ అరంగేట్రంపై టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో అవకాశం ఇవ్వలేమని తెలిసినప్పుడు.. అదే విషయాన్ని వైభవ్‌కు అర్థమయ్యేలా చెప్పాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

'కోచింగ్ స్టాఫ్‌ ప్లేయర్లతో స్పష్టంగా మాట్లాడాలి. వైభవ్‌ను ఆడించకపోతే ఆ విషయాన్ని క్లియర్‌గా అతడికి అర్థమయ్యేలా చెప్పాలి. అతడు కేవలం 15 ఏళ్ల కుర్రాడు. కాబట్టి వైభవ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకాస్త సహనం పాటించమని సలహా ఇవ్వాలి. ప్రస్తుతం జట్టులో చాలా మంది ఫామ్‌లో ఉన్నారు. సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్ 2026లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'. ఇక ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి సీనియర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైభవ్‌కు తుది జట్టులో చోటు ఇవ్వడానికి కుదరడం లేదు. ఈ విషయాన్ని వైభవ్‌కు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం.. వైభవ్‌ను ఇప్పుడే జట్టులోకి తీసుకోకపోవడమే మంచిది' అని పార్థివ్ పటేల్ తెలిపాడు. మరికాసేపట్లో మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ రెండో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లోనూ సంజు శాంసన్-అభిషేక్ శర్మ జోడీనే ఓపెనింగ్‌కు దింపనున్నట్లు సమాచారం.


వింబుల్డన్ 2026: ఫెదరర్ రికార్డును సమం చేసిన జకోవిచ్

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy