Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..

అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లోకి యూరప్ దేశాలు తమ సైనికులను పంపితే, తమతో యుద్ధం చేసినట్టే అవుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చరిక చేశారు.

న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో యూరప్ దేశాలు తమ సైనిక బలగాలను మోహరించే అంశంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి (European troops in Ukraine).

'ఉక్రెయిన్ భూభాగంలోకి సైనికులను పంపడం గురించి యూరప్ దేశాలు ఆలోచిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోకి సైన్యాన్ని పంపడం అంటే రష్యాతో యుద్ధం చేయడమే. అయితే రష్యాకు యూరప్‌తో యుద్ధం చేసే ఉద్దేశం లేదు. రష్యా ఎప్పుడూ యూరప్ దేశాలను బెదిరించలేదు. భవిష్యత్తులోనూ బెదిరించబోదు. రష్యా నుంచి ముప్పు ఉందంటూ యూరప్ నాయకులు తమ ప్రజలను భయపెడుతున్నారు. యూరప్‌తో ఘర్షణకు రష్యాకు ఎలాంటి కారణం లేదు' అని పుతిన్ పేర్కొన్నారు (Putin warning Europe).

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ఎలా కల్పించాలనే అంశంపై యూరప్ దేశాలు చర్చిస్తున్నాయి (Putin warning Europe). ఈ నేపథ్యంలో అవసరమైతే యూరప్ దేశాల సైనిక బలగాలను ఉక్రెయిన్‌లో మోహరించే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. ఇలాంటి చర్యను రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఉక్రెయిన్‌లో పాశ్చాత్య దేశాల సైనికుల ఉనికిని రష్యా చాలాకాలంగా వ్యతిరేకిస్తోంది.

strong>

రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy