Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా మంత్రి సాహసం.. చేతిపై కాటేసిన పాము.. వీడియో వైరల్..

అమెరికా మంత్రి సాహసం.. చేతిపై కాటేసిన పాము.. వీడియో వైరల్..

మెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్.కెన్నడీ జూనియర్ మరోసారి తన అత్యుత్సాహంతో వార్తల్లో నిలిచారు. పాములను ఒట్టిచేతులతో పట్టుకున్నారు. వాటిని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక పాము ఆయన చేతిపై కాటేసింది.

అయితే ఆ పాము విషపూరితమైనది కాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (RFK Jr snake video).

ఫ్లోరిడాలోని ప్రముఖ డాక్టర్ ఓజ్ ఇంట్లోకి రెండు బ్లాక్ రేసర్ సర్పాలు ప్రవేశించాయి. వాటిని పట్టుకునేందుకు కెన్నడీ అక్కడకు వెళ్లారు. రెండింటినీ రెండు చేతులతో పట్టుకున్నారు. ఆ సమయంలో ఒక పాము పైకి లేచి కెన్నడీ ఎడమ చేతిని కరిచింది. దీంతో అక్కడ ఉన్నవారు షాకయ్యారు. అయితే కెన్నడీ మాత్రం ఎలాంటి భయమూ లేకుండా పాములను పట్టుకున్నారు (RFK Jr bitten by snake).

కెన్నడీ గతంలో కూడా వన్యప్రాణులపై ఆసక్తి చూపించి వార్తల్లో నిలిచిన ఘటనలు ఉన్నాయి (Black racer snakes). గతంలో చనిపోయిన ఎలుగుబంటి పిల్లను పార్కులో వదిలేయడం, రోడ్డుపై చనిపోయిన రక్కూన్ శరరీ భాగాన్ని ప్రయోగం కోసం తీసుకెళ్లడం వంటి ఘటనలతో ఆయన వార్తల్లో నిలిచారు.


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy