Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. కొనుగోలుదారులు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ దేశాల ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పటికీ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి (Gold and Silver Rates).

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,030గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,940గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,180గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,44,090గా ఉంది. (Gold Rate live).

మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,89,900గా, బెంగళూరులో రూ.2,79,900గా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..

వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy