Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అండర్ 20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు

అండర్ 20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు

ఇంటర్నెట్ డెస్క్: అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా మరో మూడు పతకాలను ఖాతాలో వేసుకున్నారు.

68 కేజీల విభాగంలో మాన్సీ లాథర్‌ రజత పతకం సాధించగా.. 57 కేజీల్లో తాన్వి గుండేశ్‌ మగ్దుమ్‌, 59 కేజీల్లో కోమల్‌ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 68 కేజీల విభాగంలో ఫైనల్ పోరులో మాన్సీ లాథర్‌ చైనాకు చెందిన చెన్‌లింగ్‌ సాంగ్‌తో తలపడింది. హోరాహోరీగా సాగిన పోరులో మాన్సీ 1-2తో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో స్వర్ణం చేజారినా.. రజతంతో మెరిసింది.

57 కేజీల కాంస్య పతక పోరులో తాన్వి గుండేశ్‌ మగ్దుమ్‌ అద్భుతంగా రాణించింది. కెనడాకు చెందిన అగ్నియా క్రకోవ్‌స్కాను 10-4తో చిత్తు చేసి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 59 కేజీల విభాగంలో కోమల్‌ కూడా మెరిసింది. హంగేరీకి చెందిన ఎడా బాలాజ్‌ను 5-2తో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

ప్రపంచ ఛాంపియన్‌గా కాజల్‌!

భారత యువ రెజ్లర్‌ కాజల్‌ ధోచక్‌ సంచలన ప్రదర్శనతో 76 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో చైనాకు చెందిన జింగ్రు సన్‌పై 7-0తో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. 18 ఏళ్ల కాజల్‌కు ఇది మరో ప్రతిష్ఠాత్మక విజయం. ఇప్పటికే 2024 అండర్‌-17 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 69 కేజీల టైటిల్‌, 2025 అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 72 కేజీల టైటిల్‌ సాధించింది. ఈ ఏడాది అండర్‌-23 ఆసియా ఛాంపియన్‌షిప్‌, బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లోనూ స్వర్ణాలు గెలిచింది.

72 కేజీల విభాగంలో తను శర్మ స్వర్ణం కోసం చివరి వరకు పోరాడింది. జపాన్‌కు చెందిన చిసాటో యోషిడాతో జరిగిన ఫైనల్లో తీవ్రంగా పోరాడిన తను.. 3-5తో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. 62 కేజీల ఫైనల్లో సవితకు మాత్రం జపాన్‌ రెజ్లర్‌ సాకురా ఓనిషి నుంచి గట్టి పోటీ ఎదురైంది. సాంకేతిక ఆధిపత్యంతో 2-12తో ఓటమి ఎదురైనా.. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన సవిత రజతం సాధించింది.

strong>

ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy