Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్పు గొడవ.. కారు బానెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

అప్పు గొడవ.. కారు బానెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

ర్ణాటకలోని మైసూరులో ఒక దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి అడిగిన వ్యక్తిని కారు బోనెట్‌పై దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Mysuru viral video).

మైసూరుకు చెందిన మహాదేవ్ అనే వ్యక్తి ధనుంజయ్‌కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధనుంజయ్ తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు మహాదేవ్ కారును ఆపేందుకు బానెట్‌పైకి ఎక్కాడు. అయినా ధనుంజయ్ కారు ఆపకుండా వేగంగా నడిపించాడు (Man dragged on car bonnet).

మహాదేవ్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బానెట్‌ను పట్టుకుని వేలాడుతూ వెళ్లాల్సి వచ్చింది (Mysuru loan dispute). మైసూరులోని అండోలన సర్కిల్ నుంచి కువెంపునగర్ పోలీస్ స్టేషన్ రోడ్డువరకు దాదాపు 500 మీటర్లు అలాగే వెళ్లాడు. ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. వీడియో బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

.

మదీనా చౌరస్తాలోని వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం..

తెలంగాణలో మే 25 నుంచి 'మహిళా వారోత్సవాలు'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy