Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్జెంటీనా జెర్సీ కళ తప్పుతుంది.. మెస్సి రిటైర్‌మెంట్‌పై భావోద్వేగ సందేశాలు

అర్జెంటీనా జెర్సీ కళ తప్పుతుంది.. మెస్సి రిటైర్‌మెంట్‌పై భావోద్వేగ సందేశాలు

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ ప్లేయర్లు అతడి అద్భుతమైన కెరీర్‌కు గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు.

'నంబర్ 10 లేకుండా అర్జెంటీ జెర్సీ ఇకపై ప్రత్యేకంగా అనిపించదు. ఒత్తిడి, పట్టుదల, ఎన్నో పరాజయాలు, చివరకు అద్భుతమైన విజయాలతో మీ ఫుట్‌బాల్ కెరీర్ నిండిపోయింది. మెస్సి.. నువ్వు వదిలిన వారసత్వం అద్భుతం' - శిఖర్ ధావన్

'చరిత్ర తిరగరాస్తూనే దిగ్గజాలుగా నిలిచేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో నువ్వొకడివి లియో. ఆహా.. ఎంత అద్భుతమైన కెరీర్! చివరి విజిల్ తర్వాత కూడా ప్రపంచం ఈ ఆటగాడిని గుర్తుంచుకుంటుంది' - యువరాజ్ సింగ్

అర్జెంటీనా తరఫున ఎన్నో రికార్డులు

మెస్సి అర్జెంటీనా తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానే కాకుండా.. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. జాతీయ జట్టు తరఫున 203 మ్యాచ్‌లు ఆడి 124 గోల్స్ సాధించాడు. 2006 నుంచి 2026 వరకు ఏకంగా ఆరు ప్రపంచకప్‌లలో మెస్సి పాల్గొన్నాడు. మొత్తం 34 మ్యాచ్‌ల్లో 21 గోల్స్ సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే 22 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి వీడ్కోలు పలికినా.. క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం కొనసాగనున్నాడు. అమెరికా మేజర్ లీగ్ సాకర్‌లో ఇంటర్ మియామి తరఫున అతడు తన ఆటను కొనసాగించనున్నాడు.

strong>

యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి రౌండ్‌లో ఘన విజయం

ఇంకెప్పుడు జట్టుకు అండగా ఉంటావు.. బాబర్ ఆజమ్‌పై పాక్ బ్యాటర్ ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy