Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అస్సాం వరదలు.. ఆవు దూడ కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి..

అస్సాం వరదలు.. ఆవు దూడ కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి..

ఇంటర్‌నెట్ డెస్క్: వరద నీటిలో చిక్కుకుపోయిన ఆవు దూడ కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. భయంతో గజగజలాడుతున్న ఆవు దూడ కోసం వరద నీటిలోకి దిగాడు.

ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీసుకువచ్చాడు. అస్సాంలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వరద బీభత్సం కారణంగా శివసాగర్ జిల్లాలోని నజీరా ఏరియా పూర్తిగా నీట మునిగింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో పశువులు వదర నీటిలో కొట్టుకుపోయాయి.

ఓ ఆవు దూడ వరద నీటిలో చెట్టు కొమ్మల మధ్య చిక్కుకుపోయింది. ఇది గమనించిన ఓ వ్యక్తి.. ప్రాణాల కోసం పోరాడుతున్న దాన్ని కాపాడాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం తన ప్రాణాలను లెక్క చేయలేదు. అతడు వరద నీటిలోకి దూకాడు. ఆవు దూడ ఉన్న చోటుకు వెళ్లాడు. చెట్టు కొమ్మల మధ్య నుంచి దాన్ని బయటకు లాగాడు. ఎంతో కష్టం మీద దాన్ని నీటి నుంచి బయటకు లాక్కువచ్చాడు. ఇతరులు కూడా అతడికి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ వ్యక్తిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

>

రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్

టీడీపీ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు: పల్లా శ్రీనివాసరావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy