Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు: పల్లా శ్రీనివాసరావు

టీడీపీ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు: పల్లా శ్రీనివాసరావు

మరావతి, జులై 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) పేర్కొన్నారు.

అందువల్ల నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించారు. ఎవరైనా గీత దాటితే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని అందరు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని అందరు దృష్టిలో పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈరోజు(బుధవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు.

బోండా ఉమా వివరణతో టీడీపీ హైకమాండ్ సంతృప్తి..

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన వివరణతో టీడీపీ హైకమాండ్ సంతృప్తి చెందిందని తెలిపారు. పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై చర్యలు మాత్రం తప్పవని హెచ్చరించారు. పార్టీ నియమావళికి అందరు కట్టుబడి ఉండాలని ఆదేశించారు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు ఎవరు వేదిక పంచుకోవద్దని హుకుం జారీ చేశారు. ఎక్కడైనా నివాళులు అర్పించాల్సి వేస్తే వెళ్లి రావాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. అందరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

గొడ్డలి పార్టీ ఏపీని సర్వనాశనం చేసింది: మంత్రి నిమ్మల

రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం కూటమి ప్రయత్నిస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం నాడు కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరు కూడా అధినేతకు మద్దతు ఇవ్వాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలకు, లైన్‌కు కట్టుబడి పని చేయాలని ఆదేశించారు. మనకు వచ్చిన గౌరవం, అధికారం పార్టీ ద్వారా, చంద్రబాబు ద్వారా వచ్చిందని నేతలు అందరు తెలుసుకోవాలని తెలిపారు. పార్టీ లైన్ దాటిన వారిని, పార్టీకి నష్టం కలిగించే వారు ఎవరైనా కూడా ఎంతటివారు అయినా కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

బాధ్యతాయుతంగా ఉండాలి..

ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని మంత్రి నిమ్మల సూచించారు. కూటమి ధర్మాన్ని పాటించకపోతే మాత్రం ఎంతటివారైనా కూడా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారని అన్నారు. కొంతమంది నేతలను పిలిపించి మాట్లాడుతున్నామని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమనేది అందరు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీకి, కూటమికి ఎవరైనా విఘాతం కలిగిస్తే మాత్రం హై కమాండ్ ఊరుకోదని హెచ్చరించారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని ఎవరైనా మాట్లాడితే మాత్రం ఉపేక్షించవద్దని చంద్రబాబు స్పష్టం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

సూర్యుడు.. మేడిన్‌ చైనా!

ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy