Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ తొలి స్పందనిదే..

అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ తొలి స్పందనిదే..

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల వయసులోనే తన అత్యద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ టీ20 జట్టులో చోటుదక్కింది.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలు సహా ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్లలో అతడికి స్థానం కల్పించింది బీసీసీఐ. దీంతో టీమ్ఇండియాకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడీ బుడ్డోడు. ఇక.. వైభవ్ ఎంపికపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించాడు.

'ఇంత చిన్న వయసులో వైభవ్ ఆడుతున్న తీరు అసాధారణం. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లోనూ దాదాపు ఒంటిచేత్తో రాజస్థాన్ రాయల్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ సీజన్‌లోనే కాదు.. గత సీజన్ నుంచే అతడు తన ప్రతిభను చాటుకున్నాడు. తీవ్రమైన పోటీ, ఒత్తిడితో కూడిన టీ20 క్రికెట్లో ఎంతద్భుతంగా బ్యాటింగ్ చేయగలడో చూపించాడు. టీ20 క్రికెట్లో అతడిపై చాలా ఆశలున్నాయి. క్షణాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యం అతడి సొంతం(గేమ్ ఛేంజర్). ఆ ప్రతిభతోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు' అని కొనియాడాడు అగార్కర్.

వైభవ్ ఎంపికతో భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. భవిష్యత్తులో టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగంలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో దేశీయ క్రికెట్‌తో పాటు టీ20 టోర్నీల్లో సూర్యవంశీ ప్రదర్శించిన అద్భుత ఆటతీరు సెలెక్టర్లను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో.. అతడు చూపిన ధైర్యం, దూకుడు, మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. యువ ఆటగాడైనా అనుభవజ్ఞుడిలా ఆడుతూ జట్టుకు విజయాలను అందించడం విశేషం.

ఇవీ చదవండి:

టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు..

ధోని సరసన పంత్.. టెస్టుల్లో అరుదైన ఘనత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy