Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ అరుదైన రీతిలో స్వాగతం పలికారు.

మేరీల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌, ఆయన భార్య పెంగ్‌ లియువాన్‌కు.. ట్రంప్‌, మెలానియా ట్రంప్‌ స్వయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైనిక స్వాగత కార్యక్రమంలో రెండు బీ-1 బాంబర్‌ విమానాలు గగనతలంలో దూసుకెళ్లాయి.

వీడియో ఇక్కడ చూడండి..

అతి భారీ శబ్దంతో బాంబర్లు దూసుకెళ్తున్న సమయంలో ట్రంప్‌ ముఖంలో కాస్త ఉలిక్కిపాటు కనిపించింది. ఆ పక్కనే ఉన్న జిన్‌పింగ్‌ మాత్రం నిశ్శబ్దంగా నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రంప్‌ స్పందించిన తీరు, అదే సమయంలో జిన్‌పింగ్‌ కూల్‌గా కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

కాగా.. జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం పలికేందుకు జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 100 అడుగుల పొడవైన రెడ్‌ కార్పెట్‌ సహా 21 మంది సభ్యులతో గౌరవ వందనం, అమెరికా-చైనా జెండాలతో కూడిన కలర్‌ పార్టీ, సైనిక బ్యాండ్‌ తదితరాలతో అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. విదేశీ అధినేతను అమెరికా అధ్యక్షుడు విమానాశ్రయంలో స్వయంగా ఆహ్వానించడం చాలా అరుదు. గతంలో 1962లో నాటి యూఎస్ ప్రెసిడెంట్ జాన్‌ ఎఫ్‌.కెన్నెడీ.. బ్రిటన్‌ ప్రధాని హెరాల్డ్‌ మెక్‌మిలన్‌ను విమానాశ్రయంలో స్వాగతించిన తర్వాత.. ఈ తరహాలో మరో విదేశీ నేతను ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఇక.. జిన్‌పింగ్‌ మూడు రోజుల అమెరికా పర్యటనలో ట్రంప్‌తో వాణిజ్యం, సాంకేతికత, కృత్రిమ మేధ, అరుదైన ఖనిజాల సరఫరా తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy