Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాత్రూమ్ టైల్స్‌పై జారకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

బాత్రూమ్ టైల్స్‌పై జారకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఇంటర్నెట్ డెస్క్: బాత్రూమ్ టైల్స్ తడిగా ఉంటే జారి పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జారి పడే అవకాశం ఎక్కువ. అందుకే బాత్రూమ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా, పొడిగా ఉంచాలి.

కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే జారిపడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

టైల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి

బాత్రూమ్ టైల్స్‌పై తేమతో పాటు సబ్బు మరకలు, మురికి పేరుకుపోతాయి. ఇవి నేలను మరింత జారుడుగా మారుస్తాయి. కాబట్టి బాత్రూమ్ నేలను తరచూ శుభ్రం చేయడం వల్ల జారిపడే ప్రమాదం తగ్గుతుంది.

వెనిగర్‌తో శుభ్రం చేయాలి

ఒక బకెట్ నీటిలో ఒక భాగం తెల్ల వెనిగర్, రెండు భాగాలు నీరు కలపాలి. ఈ మిశ్రమంతో బాత్రూమ్ నేలను శుభ్రం చేస్తే టైల్స్‌పై పేరుకుపోయిన జిడ్డు, మురికి తొలగిపోతాయి.

బేకింగ్ సోడా, వెనిగర్ ఉపయోగించాలి

బాత్రూమ్ నేలపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, దానిపై వెనిగర్ పోయండి. కొద్దిసేపటి తర్వాత నురుగు వస్తుంది. ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది శుభ్రమైన నీటితో కడగాలి. ఈ పద్ధతి నేలపై ఉన్న జిడ్డును తొలగించడంలో సహాయపడుతుంది.

యాంటీ-స్లిప్ మ్యాట్స్ ఉపయోగించాలి

బాత్రూమ్‌లో షవర్ దగ్గర, తలుపు దగ్గర జారకుండా ఉండే మ్యాట్స్ వేయడం మంచి పరిష్కారం. ఇవి పాదాలకు మంచి పట్టును ఇస్తాయి, జారిపడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy