Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బైక్ హెడ్‌లైట్‌లో చప్పుడు.. ఏముందా అని చూడగా.. చివరకు షాకింగ్ సీన్

బైక్ హెడ్‌లైట్‌లో చప్పుడు.. ఏముందా అని చూడగా.. చివరకు షాకింగ్ సీన్

ఇంటర్నెట్ డెస్క్: పింప్రి-చించ్వాడ్‌లోని దాపోడిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైకు హెడ్‌లైట్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఉన్న పామును రక్షించారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ హెడ్‌లైట్ లోపలి నుంచి పాము నెమ్మదిగా బయటకు వస్తుండగా, పాములను రక్షించిన జయవర్ధన్ కాంబ్లే దానిని సురక్షితంగా పట్టుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. వన్యప్రాణి, పక్షి సంరక్షణ సామాజిక సంస్థతో అనుబంధం ఉన్న కాంబ్లే.. ఆ సరీసృపం గురించి సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును రక్షించి, అనంతరం దాని సహజ ఆవాసంలోకి విడిచిపెట్టారు. అది ట్రింకెట్ పాముగా గుర్తించారు .

ఈ జాతి పాము మనుషులకు విషపూరితమైన ముప్పును కలిగించదని స్నేక్ క్యాచర్ తెలిపారు. అయితే ఆత్మరక్షణ కోసం బుసలు కొడుతుందని, కాటు వేస్తుందన్నారు. దీని వల్ల నొప్పిని మాత్రమే కలుగుతుందని వివరించారు. ఈ పాము సాధారణంగా అడవులు, గడ్డి మైదానాలు, వ్యవసాయ క్షేత్రాలు, రాతి ప్రాంతాలు, గ్రామాలు, పట్టణ శివార్లలో కూడా కనిపిస్తుంది. ఇది తరచుగా ఎలుకలు వంటి ఆహారం కోసం వెతుకుతూ నివాసాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. 'వర్షా కాలంలో ఇలాంటి పాములు వస్తుంటాయి.. జాగ్రత్తగా ఉండాలి' అని ఒకరు, 'బైక్ నడిపే సమయంలో ఇది బయటకు వస్తే.. పెద్ద ప్రమాదం జరిగేది' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy