సెప్టెంబరులో రికార్డు ఉష్ణోగ్రతలు
ఉక్కపోతతో జనం విలవిల
బళ్లారి(బెంగళూరు): చల్లని వానలు, గాలితో జనం హయిగా సేదతీరాల్సిన సమయంలో బళ్లారిలో ఎండలు భగ్గుమంటున్నాయి.
పగలు సూర్యుడు భగభగమంటున్నారు. ఇక రాత్రి పూట గాలీ వీచకుండా ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఎన్నడూ లేనంతగా సెప్టెంబరు నెలలో వేడితో జనం బెంబేలెత్తిపోతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బయటికి రావాలంటే జనం హడలిపోతున్నారు.
సూపర్ ఎలీనోతో పసిఫిక్ మహసముద్రం వేడిఎక్కడంతో ఎండలు మరింత ఎక్కువయ్యాయని వాతావరణ శాస్త్రవేతలు పేర్కొంటున్నారు. ఉత్తర కర్ణాటక జిల్లాలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, వియజయనగర, బీదర్, కలబురగి, ఇలా అనేక జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వీటికి తోడు పరిశ్రమల నుంచి వెలవడే వాయుకాలుష్యం, తారు రోడ్డు, సిమెంటు కంకర్లతో కట్టిన పెద్దపెద్ద భవనాలలో కూడా వేడిగాలులు వీస్తుండంతో రోజూ 35 డిగ్రీలు దాటిపోతున్నాయి.
అనావృష్టి కారణంగా ప్రజలు, పశుపక్షాదులు అన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబరులో ఇంటిలో నిద్రించే వారు చలికి దుప్పెట్లు కప్పుకుని నిద్రించేవారు. కానీ విపరీత మైన వేడి కారణంగా అసలు ఇంట్లో నిద్రించలేక పోతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు వేసుకున్నా వేడిగాలులు వీస్తుండడం వల్ల జనం ఈ విపత్తులను చూసి భయపడుతున్నారు. పిల్లలు, వృద్ధులు వేడికి తాళలేక అల్లాడిపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మోదీని కలిసిన స్కూల్‌మేట్‌కు తిరిగొచ్చిన భూమి.. స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే..

