Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బర్క్‌షైర్ హ్యాథవే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న వారెన్ బఫెట్

బర్క్‌షైర్ హ్యాథవే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న వారెన్ బఫెట్

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బర్క్‌షైర్ హాథవే చైర్మన్ బాధ్యతల నుంచి అపరకుబేరుడు వారెన్ బఫెట్ తప్పుకున్నారు. సంస్థ నూతన చైర్మన్‌గా బఫెట్‌ తనయుడు హోవర్డ్‌ను బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నుకుంది.

ఇక సంస్థ చైర్మన్ ఎమిరిటస్ బాధ్యతలను బఫెట్ చేపట్టారు. అంతేకాకుండా, హ్యాథవే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా, సలహాదారుగా కూడా ఆయన కొనసాగనున్నారు. బర్క్‌షైర్‌పై వారెన్ బఫెట్ చూపించిన ప్రభావం అమెరికా వ్యాపార చరిత్రలో కనీవినీఎరుగనిదని సంస్థ సీఈఓ గ్రెగ్ అబెల్ ప్రశంసించారు. బఫెట్ నిర్మించిన సంస్కృతి, విలువలను కొనసాగిస్తామని చెప్పారు.

తన తరువాత హ్యాథవే బాధ్యతలు ఎవరు నిర్వహించాలనే విషయంపై బఫెట్ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే హోవర్డ్ బఫెట్‌కు చైర్మన్ బాధ్యతలు దక్కాయి. 1999 నుంచి హోవర్డ్ బఫెట్ ఫౌండేషన్ చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, ఘర్షణల నివారణకు ఆయన కృషి చేశారు. వారెన్ బఫెట్ ఆధ్వర్యంలో బర్క్‌షైర్ హ్యాథవే సంస్థ కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకున్న తొలి నాన్ టెక్ సంస్థగా గుర్తింపు పొందింది. దీర్ఘకాలిక పెట్టుబడులతో సంపద సృష్టిలో తనకు తానే సాటి అని బఫెట్ నిరూపించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శుక్రవారం మార్కెట్: లాభాల్లో నిఫ్టీ, స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్

పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy