Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెన్ స్టోక్స్‌ రిటైర్‌మెంట్...మనసులో మాట బయటపెట్టిన కోచ్ మెక్‌కల్లమ్!

బెన్ స్టోక్స్‌ రిటైర్‌మెంట్...మనసులో మాట బయటపెట్టిన కోచ్ మెక్‌కల్లమ్!

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించి అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టు నాలుగో రోజే అతడు ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో ఓడిపోయి, సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్నప్పటికీ.. స్టోక్స్ రిటైర్‌మెంట్ వార్తే ప్రత్యేకంగా నిలిచింది.

స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ స్పందిస్తూ.. స్టోక్స్‌ రిటైర్మెంట్ ప్రకటించాడానికి ముందే నిర్ణయాన్ని మార్చుకోవాలని తాను వారించానని వెల్లడించాడు. స్టోక్స్ మనసు మార్చేందుకు తాను ఎంతో ప్రయత్నించానని, కానీ అతడు అప్పటికే మానసికంగా సిద్ధమయ్యాడని మెక్‌కల్లమ్ పేర్కొన్నాడు.

ఓస్పోర్ట్స్ ఛానల్ తో మెక్‌కల్లమ్ మాట్లాడుతూ...'స్టోక్స్ తన నిర్ణయాన్ని నాతో చెప్పినప్పుడు మొదట నేను వద్దని సర్ది చెప్పడానికి ప్రయత్నించాను. కానీ అతడి మనసు ప్రశాంతంగా ఉందని, తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని అర్థమైంది. గత నాలుగేళ్లుగా మేమిద్దరం కలిసి సాగించిన ఈ ప్రయాణం ఇంత అకస్మాత్తుగా ముగియడం కొంత బాధగా ఉంది' అని తెలిపాడు.

'స్టోక్స్ ఒక గొప్ప కెప్టెన్. మైదానం, డ్రెస్సింగ్ రూమ్‌, హోటల్‌.. ఇలా ఎక్కడైనా సరే అందరూ అతడినే అనుసరిస్తారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా జట్టులో ప్రశాంతతను నింపే గొప్ప వ్యక్తిత్వం అతడిది. అలాంటి ఆటగాడి లోటును పూడ్చడం చాలా కష్టం' అని కొనియాడారు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో క్రికెట్‌ను దాటి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడని, మైదానంలో అతడికి ఘనమైన వీడ్కోలు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై కొత్త కెప్టెన్‌తో ఇంగ్లండ్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడతామని మెక్‌కల్లమ్ స్పష్టం చేశాడు.


ఆసియా గేమ్స్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్

వంటమనిషిపై దాడి.. పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై కేసు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy