Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వంటమనిషిపై దాడి.. పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై కేసు

వంటమనిషిపై దాడి.. పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై కేసు

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శశాంక్ సింగ్‌, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై కేసు నమోదు అయింది.

తనపై దాడి చేసి, అసభ్యకర పదజాలంతో దూషించారని ఇంట్లో పనిచేసే వంటమనిషి ఆరోపించాడు. ఈ క్రమంలో బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ భోపాల్‌లో రతీబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శశాంక్ సింగ్, అతడి తండ్రిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవలే భోపాల్‌కు వచ్చిన విపేంద్ర సింగ్ నెలకు రూ.15 వేల జీతంతో శశాంక్ సింగ్ ఇంట్లో పనికి చేరాడు. ఉచిత భోజనం, వసతి కల్పించడంతోపాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తామని శశాంక్ కుటుంబం హామీ ఇచ్చారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే పనిలో చేరిన కొద్ది గంటల్లోనే మానసికంగా ఒత్తిడి పెట్టడం ప్రారంభించారని, దురుసు ప్రవర్తన, వండిన ఆహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అవమానించారని ఆరోపించాడు. ఇవన్నీ భరించలేక ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్తాలని చెప్పడంతో వారు ఆగ్రహానికి గురయ్యారని, బయటి వారితో మాట్లాడకుండా తన మొబైల్ ఫోన్ లాక్కొని బలవంతంగా పనిచేయించారని బాధితుడు పేర్కొన్నాడు. భయంతో ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నప్పటికీ.. శశాంక్ సింగ్, శైలేష్ సింగ్, వారి డ్రైవర్ కలిసి తలుపు బద్దలు కొట్టి తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. అయితే పోలీసులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాధితుడి ముఖం, శరీరంపై గాయాలు గుర్తించినట్లు సమాచారం.


వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు: కైఫ్

ఫిఫా ప్రపంచ కప్: పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే సంచలన విజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy