Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత సైన్యం కీలక నిర్ణయం.. సైనికుల మొబైల్ ఫోన్లలో 87 యాప్‌ల నిషేధం

భారత సైన్యం కీలక నిర్ణయం.. సైనికుల మొబైల్ ఫోన్లలో 87 యాప్‌ల నిషేధం

న్యూఢిల్లీ: దేశ భద్రతకు భారత సైన్యం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. దేశ రక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలను ఎప్పటికప్పుడు చేపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా సైనికులు తమ మొబైల్ ఫోన్లలో వినియోగించే యాప్‌ల విషయంలో కఠిన నిబంధనలు విధించింది.

ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, హింజ్, పబ్‌జీ వంటి ప్రముఖ యాప్‌లతో పాటు పలు సోషల్ మీడియా, డేటింగ్, గేమింగ్ యాప్‌ల వినియోగంపై ఆంక్షలు విధించింది. మొత్తం 87 రకాల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించకూడదని సైనికులు, అధికారులు సహా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ యాప్‌ల ద్వారా దేశ విద్రోహశక్తులు సైనికులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భారత సైన్యం భావిస్తోంది. వారి వ్యక్తిగత సమాచారం, లొకేషన్ వివరాలు, విధులకు సంబంధించిన కీలక వివరాలను సేకరించి ప్రమాదం ఉందని అనుమానిస్తోంది. అలాగే, ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సైనికులు నెట్టింట షేర్ చేసే ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలు దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ సమాచారాన్ని శత్రు దేశాల నిఘా సంస్థలు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నందున భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అలాగే, సైనికులు హనీట్రాప్, సైబర్ దాడుల బారిన పడకుండా ఈ చర్యలు చేపట్టింది.

కాగా, సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి భారత సైన్యం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను సవరిస్తూ వస్తోంది. గతంలోనూ కొన్ని సోషల్ మీడియా వేదికల్లో సమాచారాన్ని వీక్షించేందుకు మాత్రమే అనుమతించింది. అక్కడ పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం, సందేశాలు పంపడం వంటి కార్యకలాపాలపై పరిమితులు విధించింది. సైనికుల వ్యక్తిగత ఆన్‌లైన్ కార్యకలాపాల కంటే దేశ భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ నిబంధనలను అమలు చేస్తోంది. కాగా, తాజా ఆంక్షల జాబితాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, పబ్‌జీ, క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటి గేమింగ్ యాప్‌లు ఉన్నాయి. అలాగే టిండర్, హింజ్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లతో పాటు వీచాట్, షేర్‌ఇట్, యూసీ బ్రౌజర్, ట్రూకాలర్, జూమ్, డైలీహంట్ వంటి యాప్‌లూ ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి

తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతి

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు ఇవ్వడానికి ఓకే: ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy