Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతి

తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌, నవంబర్ 24: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ధాత్రి అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ట్యాంక్‌లోకి దిగిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన కార్మికులు ప్రమాదవశాత్తూ ఊపిరాడక మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ట్యాంక్ నుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? సెప్టిక్ ట్యాంక్‌లో విషవాయువుల కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందా? కార్మికులకు తగిన భద్రతా చర్యలు కల్పించారా, లేదా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆత్మీయ నేస్తం టెలీ మానస్‌

సీఎం హోదాలో ఉండి అబద్ధాలు చెబితే నిజాలు అయిపోవు: హరీశ్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy