న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రపంచంలో పాము కాటు కేసులు భారీగా నమోదవుతున్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉందని, ఏటా 13లక్షల కేసులు నమోదవుతున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది.
అయితే, పాము కాటు కారణంగా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న దేశాల జాబితాలో మాత్రం ఆఫ్రికా ఉపఖండం ముందు వరుసలో ఉందని తెలిపింది. 2007-2025 మధ్య జరిగిన సంఘటనలు, నమోదైన కేసులపై అధ్యయనం చేసిన పరిశోధకులు, విశ్లేషకులు ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. పాము కాటు కేసులు నమోదవుతున్న దేశాలు 20 మాత్రమేనని తెలిపారు. లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం మేరకు.. ఏటా 21 లక్షల మందిని పాములు కాటేస్తున్నాయి. మొత్తంగా పాము కాటు కారణంగా ఏటా 2.74 లక్షల నుంచి 5.13 లక్షల మంది మృతి చెందుతున్నట్టు పరిశోధకులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:

