Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్..  లాభాల్లో దేశీయ సూచీలు..

భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు..

మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం సూచీలను ముందుకు నడిపిస్తోంది.

డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.86) కాస్త బలహీనపడింది. ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).

గత సెషన్ ముగింపు (76,200)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 76,438 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 58 పాయింట్ల లాభంతో 23,882 వద్ద కదలాడుతోంది (stock market news today).

సెన్సెక్స్‌, నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, శ్రీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, భెల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఐఆర్‌ఎఫ్‌సీ, వెర్నోవా టీడీ, హిటాచీ ఎనర్జీ, స్విగ్గీ, బజాజ్ ఆటో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 32 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

.

విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy