Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్

భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్

లూరు జిల్లా, మే 18 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొలుసు పార్థసారథి (AP Minister Kolusu Parthasarathy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భార్యను అడ్డుపెట్టుకొని నాని బతికిపోయారని విమర్శించారు. ఈరోజు (సోమవారం) ఏలూరు జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు పేర్నినాని, జోగి రమేశ్ నూజివీడులో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో చేసిన విమర్శలకు ఘాటుగా పార్థసారథి బదులిచ్చారు.

నాని.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..

'కాంగ్రెస్‌లో ఉంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర రూట్ మ్యాప్ పర్యవేక్షించిన రాజకీయ వ్యభిచారి పేర్ని నాని. భార్యను అడ్డం పెట్టుకొని అవినీతి, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడ్డారు. మహిళలను వేధించకూడదని సీఎం చంద్రబాబు చెప్పారు.. అందుకే పేర్ని నాని బతికిపోయారు. నాని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అమరావతిపై విషం చిమ్మితే 11 సీట్ల నుంచి సున్నాకు వైసీపీ పడిపోతుంది. ప్రజలతో దొంగ మందు తాగించి అనారోగ్యం పాల్జేసి జగన్ అండ్ కో వేలకోట్లు దోచుకున్నారు' అని పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy