Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

ఇంటర్నెట్ డెస్క్, మే 17 (ఆంధ్రజ్యోతి): సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి.

రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై ఆయన స్పందించారు. చెన్నైలో ఈరోజు(ఆదివారం) రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని పేర్కొన్నారు. అలాగే నటుడు విజయ్ సీఎం కావడం తనకు సంతోషమేనని వ్యాఖ్యానించారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

కమల్‌హాసన్ సీఎం అయితే అసూయపడతా

తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఇటీవల తాను కలిసిన విషయంపై కూడా రజనీకాంత్ స్పందించారు. ఆ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. స్టాలిన్ తనకు మంచి మిత్రుడని, స్నేహపూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు. కమల్‌హాసన్ సీఎం అయితే అసూయపడతానని చమత్కరించారు. విజయ్ తనకు సమవుజ్జీ అనుకోవడం లేదని తెలిపారు. అన్ని పార్టీల్లోనూ తనకు అభిమానులుంటారని పేర్కొన్నారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రవేశం, తమిళనాడు భవిష్యత్తు ఎన్నికల నేపథ్యంలో రజనీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అభిమానులు, రాజకీయ వర్గాలు ఆయన వ్యాఖ్యలపై విభిన్నంగా స్పందిస్తున్నాయి.

గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ స్థాపిస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరికి ఆయన అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో ఆయన అభిమానుల్లో చర్చ మొదలైంది. తమిళనాడు రాజకీయాలపై రజనీకాంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

.

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy