Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి

భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారని హెచ్చరించారు. అలాంటి వారికి రాజకీయంగా భవిష్యత్తు ఉండదని ధ్వజమెత్తారు. ఈరోజు (బుధవారం) భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో.. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి సంస్థ(FCDA) భవనాన్ని ప్రారంభించారు. FCDA లోగో, వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని ఆగ్రహించారు. అభివృద్ధి జరగొద్దని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉన్నారు..

ఇప్పుడు ఫ్యూచర్‌ సిటీని అడ్డుకునేందుకు కొందరు యత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. మారీచుడు, సుభాహు జనంలోకి వచ్చారని సెటైర్లు గుప్పించారు. వీళ్లంతా కలిసి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కడుపునిండా విషం నింపుకొని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఏడ్చేవాళ్లు ఏడవండి.. తాము అభివృద్ధి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నిన్న కురిసిన రెండు గంటల వర్షానికే హైదరాబాద్‌ వరదమయమైందని చెప్పుకొచ్చారు. ఇదేనా మీ పదేళ్ల అభివృద్ధి? అని ప్రశ్నించారు. చెరువులు, నాలాలు కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుతాం..

బతుకమ్మ కుంట ఏమైనా ఎడ్ల సుధాకర్‌ తాత ఆస్తినా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కబ్జాకోరులు బాధపడినా పర్వాలేదని.. తమ అభివృద్ధి ప్రయత్నం మాత్రం ఆగదని తేల్చిచెప్పారు. కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుతామని.. తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి దిక్సూచిగా ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం నిలుస్తుందని పేర్కొన్నారు. టోక్యో, సింగపూర్‌తో ఫ్యూచర్‌ సిటీ పోటీ పడుతుందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలను ఫ్యూచర్‌ సిటీకి తీసుకొస్తున్నామని వివరించారు. ఫ్యూచర్‌ సిటీలో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy