ఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): ఏపీని భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థికవ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు.
ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని పేర్కొన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ (NEI), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం (USISPF) సంయుక్తంగా యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా పేరిట యూఎస్ న్యూక్లియర్ ప్రతినిధులతో ఈరోజు (సోమవారం) ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు మంత్రి నారా లోకేశ్ అతిథిగా హాజరై ప్రసంగించారు.
విస్తృత అవకాశాలు ఉన్నాయి..
స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం రియాక్టర్ సిస్టమ్స్ వంటి ఆధునిక న్యూక్లియర్ సాంకేతికతలు, మాడ్యులర్ తయారీ, సప్లయ్ చైన్ పంపిణీ, స్కేలబుల్ వినియోగం నమూనాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి లోకేశ్ వివరించారు. భారత్‌లో ఇంజినీరింగ్ ప్రతిభ, తయారీరంగంలో విస్తృతి, ఖర్చు విషయంలో పోటీతత్వం ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పారిశ్రామిక ఇన్‌ఫ్రా, పోర్ట్స్, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, అమలు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు ఒక చరిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తున్నాం..
ఏపీకి అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నాయని లోకేశ్ తెలిపారు. తమకు సువిశాలమైన తీరప్రాంతం, శక్తిమంతమైన పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విస్తతమైన పారిశ్రామిక కారిడార్లు, ప్రతిష్ఠాత్మకమైన పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పుకొచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తున్నామని అన్నారు. పారిశ్రామికీకరణలో వేగం, అమలు అత్యంత ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఇందులో న్యూక్లియర్ ఎకోసిస్టమ్ ప్రముఖ పాత్ర వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

గ్లోబల్ భాగస్వాములతో కలిసి పనిచేస్తాం..
పర్యావరణ వ్యవస్థ ఆలోచనా విధానం ముఖ్యమని లోకేశ్ వ్యాఖ్యానించారు. సాంకేతిక సహకారాలు, తయారీ భాగస్వామ్యాలు, సప్లై చైన్ అభివృద్ధి, ఇంజినీరింగ్ ఎకోసిస్టమ్స్, రీసెర్చ్ భాగస్వామ్యాలు, స్కిల్లింగ్, వర్క్‌ఫోర్స్ అభివృద్ధి, పారిశ్రామిక ప్రమాణాలు, భవిష్యత్తు సాంకేతికల అమలుకు విశ్వసనీయ గ్లోబల్ భాగస్వాములతో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి యూఎస్ - ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ నివేదిత మెహ్రా స్వాగతం పలుకగా, న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్, సీఈవో మారియా కోర్సినిక్ హాజరయ్యారు.

.
అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్
హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

