Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిడ్డ మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ వరల్డ్ కప్‌లో గోల్‌

బిడ్డ మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ వరల్డ్ కప్‌లో గోల్‌

స్పోర్ట్స్ డెస్క్: చాలామంది పైకి ఎంతో ప్రశాంతగా కనిపిస్తుంటారు. క్రీడాకారులు సైతం మైదానంలో ఎంతో సంతోషంగా లేదా గెలుపు సీరియస్‌గా కనిపిస్తుంటారు.

పలు సందర్భాల్లో కొందరు ఆటగాళ్లు అయితే తాము తీవ్రమైన విషాదంలో ఉన్నప్పటికీ.. అది బయటకు తెలియనివ్వకుండా పంటి బిగువన అదిమిపెట్టి దేశం కోసం ఆడుతుంటారు. ఆ కోవాకు చెందిన ప్లేయరే నెదర్లాండ్స్‌ ఫుట్‌బాలర్‌ కూడీ హక్పో. తాజాగా అతడు కూడా (Cody Gakpo) అలాంటి విషాద పరిస్థితినే ఎదుర్కొన్నాడు. లోకం చూడకుండానే తన బిడ్డ మరణించినా.. బాధను దిగమింగుకుని మైదానంలోకి అడుగుపెట్టి ప్రపంచకప్‌2026లో గోల్‌ చేశాడు.

ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup 2026) నాకౌట్‌లో భాగంగా ఇవాళ(మంగళవారం) ఉదయం నెదర్లాండ్స్, మొరాకో మధ్య మ్యాచ్‌ జరిగింది. ఉత్కంఠభరిత పోరులో మొరాకో జట్టు పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. 3-2 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి రౌండ్ ఆఫ్-16కు మొరాకో అర్హత సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి 70 నిమిషాల పాటు మొరాకో ఆధిపత్యం చలాయించింది. 72వ నిమిషంలో నెదర్లాండ్ ఆటగాడు కూడీ హాక్పో ఎలాంటి తప్పిదం చేయకుండా బంతిని నెట్స్‌లోకి పంపించడంతో 1-1తో స్కోరు సమం అయింది. సాధారణంగా ఇలాంటి గోల్‌ చేసినప్పుడు స్ట్రైకర్‌తో పాటు జట్టు సభ్యులంతా సంబరాల్లో మునిగితేలుతారు. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం అలాంటివేమీ కన్పించలేదు. అందుకు భిన్నంగా నిశ్శబ్దం ఆవరించింది. డచ్ ఆటగాళ్ల ప్రవర్తనను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హాక్పో గోల్‌ కొట్టగానే అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మోకాళ్లపై వంగి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లంతా అతడిని చుట్టుముట్టి ఓదార్చారు. అతడికి అండగా నిలిచారు. ఈ మ్యాచ్‌కు సరిగ్గా మూడు రోజుల ముందే హాక్పో తన బిడ్డను కోల్పోయాడు. అతడితో రిలేషన్‌షిప్‌లో ఉన్న నోవా వాన్‌ డెర్‌ బిజ్‌ గత శనివారం ఈ విషాదకర విషయాన్ని సోషల్‌ మీడియా పోస్ట్ చేసింది. ఈ భూమి మీదకు రాకుండానే తమ బిడ్డ తమకు దూరమైందని పేర్కొన్నారు. కూడీ హాక్పో, అతడి భాగస్వామి నోవా 2025లో తొలి బిడ్డకు జన్మనిచ్చారు.

ఫిఫా వరల్డ్‌కప్‌ టోర్నీకి కొన్ని వారాల ముందు తమకు రెండో బిడ్డ పుట్టబోతున్నట్లు ప్రకటించారు. దురదృష్టవశాత్తూ ఈ బిడ్డ వారికి దూరమైంది. ఈ విషాద సమయంలో హాక్పో తన కుటుంబంతో ఉండేందుకు వీలుగా నెదర్లాండ్స్‌ మేనేజ్మెంట్ అతడికి సెలవులు ఇచ్చింది. కానీ టోర్నీలో అత్యంత కీలకమైన నాకౌట్‌ దశ జరుగుతున్న వేళ.. జట్టును వీడేందుకు అతడి అంగీకరించలేదు. అందుకే, దుఃఖం మనసులోనే దాచుకుని మ్యాచ్‌ ఆడాడు. అయితే, అతడి పోరాటం వృథా అయ్యింది.

బెన్ స్టోక్స్‌ రిటైర్‌మెంట్...మనసులో మాట బయటపెట్టిన కోచ్ మెక్‌కల్లమ్!

వైభవ్ బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ సర్‌ప్రైజ్ అవుతుంది: సునీల్ గావస్కర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy