Dailyhunt
బీజేపీ మిత్రపక్షాలకు భవిష్యత్తులో ఇబ్బందులే: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ మిత్రపక్షాలకు భవిష్యత్తులో ఇబ్బందులే: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) హెచ్చరించారు.

తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు. నితీశ్ కుమార్, ఏక్ నాథ్ షిండేల పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. ఈరోజు(శనివారం) ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్‌చాట్ చేశారు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉండటంతో.. టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వాటిని అమల్లోకి తీసుకువచ్చేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగమని తెలిపారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమని పేర్కొన్నారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తాను రాజుగా 2/ 3వ వంతు మెజార్టీతో చట్టం చేసుకుంటే ఎవరూ ఒప్పుకోరు కదా అని ప్రశ్నించారు. డిక్టేటర్‌షిప్‌ని ఎవరు ఒప్పుకోరని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు కేంద్రం రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

.

రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ శివధర్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చారిత్రాత్మకం: రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై మా ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy