న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అమరావతి అంటే తనకు ఎమోషన్ అని.. అందుకే తెలుగులో మాట్లాడతున్నాని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ..
బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నట్లు తెలిపారు. అమరావతి రైతులకు, మహిళలకు కేంద్రమంత్రి అభినందనలు తెలియజేశారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని వెల్లడించారు.
అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని కేంద్ర మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసిందన్నారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిని వైసీపీ సృష్టించిందని మండిపడ్డారు. రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయన్నారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉంటే పెట్టుబడులు రావని తెలిపారు. రాజధాని నిర్ణయం.. మార్పు.. కేంద్రం పరిధిలోనే ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
.
చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య
చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం
Read Latest AP News And Telugu News

