Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BJP: రాసిపెట్టుకోండి... తమిళనాట బీజేపీ హవా ఖాయం..

BJP: రాసిపెట్టుకోండి... తమిళనాట బీజేపీ హవా ఖాయం..

- సెంట్రల్‌ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం

చెన్నై: తమిళనాడులో బీజేపీ హవా ఖాయమని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రోడ్‌ షోతో ఈ విషయం స్పష్టమైందని సెంట్రల్‌ బీజేపీ అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం(BJP candidate Vinoj P. Selvam) ధీమా వ్యక్తం చేశారు.

గురువారం ఆయన నియోజకవర్గంలో పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇన్నాళ్లూ ద్రావిడ పార్టీలు ఇచ్చిన తప్పుడు హామీలతో రాష్ట్ర ప్రజలు మోసపోయారని, అయితే ఏ పార్టీ నిజంగా ప్రజల కోసం పని చేస్తుందో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారన్నారు. తమ పార్టీ ఇచ్చే నిఖార్సయిన హామీలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వ పరిపాలనతో దేశవ్యాప్తంగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాష్ట్రంలోనూ ప్రజలు బీజేపీని ఆదరించేందుకు సిద్ధమయ్యారన్నారు. తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే కేంద్రప్రభుత్వంతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తానన్నారు. అందువల్ల నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని మనోజ్‌ పి.సెల్వం అభ్యర్థించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy