Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఛార్లెట్‌లో ఘనంగా మదర్స్ డే వేడుకలు

ఛార్లెట్‌లో ఘనంగా మదర్స్ డే వేడుకలు

త్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో మే 16వ తేదీన ఛార్లెట్‌లో మాతృ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 500 మందికిపైగా మహిళలు రావడం విశేషం.

మహిళలు, వారి కూతుళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు హాజరై సరికొత్త రికార్డును సృష్టించారు. ఛార్లెట్‌లో ఒక వేడుకకు ఇంతమంది మహిళలు రావడం ఇదే మొదటిసారని నిర్వాహకులు చెప్పారు. ఆటలు, పాటలు, విందుభోజనాలు, డ్యాన్స్‌లు, ఇతర కార్యక్రమాలతో వేడుకలు కన్నులవిందుగా జరిగాయి.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలితోపాటు, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యార్లగడ్డ, కమ్యూనిటీ సర్వీస్‌ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఛార్లెట్‌లో ఉన్న తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్టినేటర్ మాధురి ఏలూరి మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడంతోపాటు వచ్చినవారంతా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లను చేశారు.

ఛార్లెట్‌లో ఉన్న తానా నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, రవి(నాని) వడ్లముడి తదితరులు కూడా ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకకు అతిథిగా వర్జీనియా నుంచి 'అందెలరవమిది' ఫేమ్ ఇంద్రాణి దావలూరి వచ్చారు. ఆమె తనప్రసంగంలో మహిళల ప్రాముఖ్యతను తెలియజేశారు. అలాగే సిన్సినాటి నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ 'అమ్మమ్మడు' కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె కూడా ఒక గేమ్‌ను నిర్వహించి వచ్చినవారిలో ఉత్సాహాన్ని నింపారు.

యాంకర్ స్రవంతి ప్రత్తిపాటి తనదైన శైలిలో ఎంతో హుందాగా, ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని నడిపించడంతోపాటు వచ్చినవారితో వివిధ రకాల గేమ్స్‌ను నిర్వహించారు. సింగర్ స్నిగ్ధ ఎల్లేశ్వరపు ఆలపించిన మధురమైన గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పద్మజ కొమ్మినేని, జ్యోత్స్న గంట, సౌమ్య శ్రీ తల్లాంకి, ఝాన్సీ అబ్బూరి, జ్యోత్స్న కాండ్లగుంటల అంకితభావాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy