Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చాడు.. షాకింగ్ వీడియో వైరల్..

చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చాడు.. షాకింగ్ వీడియో వైరల్..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ వ్యక్తి డెంటిస్ట్‌ అపాయింట్‌మెంట్‌కు వెళ్తుండగా అనూహ్య ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చి డెంటిస్ట్‌ దగ్గరకు వెళ్తున్న సమయంలో అతడిని పిడుగు తాకింది.

ఈ ఘటనలో అతడు కుప్పకూలిపోయినప్పటికీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాదు.. వైద్య పరీక్షల్లో అతడి శరీరంపై ఎలాంటి కాలిన గాయాలు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది (US man struck by lightning).

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు డోర్‌బెల్‌ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోని స్టేటెన్‌ ఐలాండ్‌లో చోటుచేసుకుంది. థామస్‌ ఫహ్మీ అనే వ్యక్తి గత వారం తుపాను సమయంలో డెంటిస్ట్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతడు ఇంటి నుంచి బయటకు వచ్చి తన వాహనం వైపు వెళ్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది (Lightning strike video).

పిడుగు ప్రభావానికి ఫహ్మీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే వెంటనే లేచి వెనక్కి ఇంట్లోకి వెళ్లిపోయాడు (Viral Video). పిడుగు తాకిన వెంటనే తన శరీరం మొత్తం తీవ్రమైన అనుభూతికి గురైందని ఫహ్మీ తెలిపాడు. శరీరమంతా తిమ్మిరి, మొద్దుబారడం, తీవ్రమైన నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించాయని చెప్పాడు. అయితే అతడు స్పృహ కోల్పోలేదు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య పరీక్షల్లో అతడి శరీరంపై ఎలాంటి కాలిన గాయాలూ కనిపించలేదు. మరుసటి రోజు అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

>

ఆ వైపు వెళ్లవద్దు.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ జెలెన్‌స్కీ వార్నింగ్

సీఎస్కే కోచ్‌ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy