Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్నారిని కోతి ఎలా ఆడించిందో చూశారా?.. వీడియో వైరల్

చిన్నారిని కోతి ఎలా ఆడించిందో చూశారా?.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: పసి పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎవరు పలకరించినా.. కాళ్లూచేతులూ ఊపుతూ బోసి నవ్వులు చిందిస్తారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తుంటాం.

అయితే తాజాగా కోతి ప్రేమకు ఖుషీ అయిన చిన్నారి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అచ్చం మనుషులు.. చిన్న పిల్లలను ఎలా ఆడిస్తారో అలాగే కోతి ఆడించింది. ఆ వీడియోలో ఏడాదికి కాస్త అటూ ఇటూగా వయస్సు ఉన్న చిన్నారి మంచంపై పడుకుని ఉంది. ఆ పక్కనే కోతి కూర్చొని ఉంది. ఆ చిన్నారిని కోతి ముద్దు చేస్తూ.. ఆడిస్తుంది. కోతిని చూసి చిన్నారి కాళ్లు, చేతులూ ఊపుతూ కేరింతలు కొడుతోంది.

కోతి తన తలను పదే పదే ఊపుతూ చిన్నారిని నవ్వించే ప్రయత్నం చేస్తోంది. అంతటితో ఆగకుండా మనుషుల తరహాలో ఆ చిన్నారి ఛాతీపై కోతి ముద్దు పెడుతోంది. కోతి ఇలా చేస్తున్నప్పుడు ఆ చిన్నారిలో ఏమాత్రం భయం కనిపించలేదు. చిన్నారి కాళ్లు చేతులు ఊపుతుంటే.. కోతి పరిశీలనగా గమనిస్తోంది. ఈ వీడియోను ashwin07282 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు15 లక్షల మందికిపైగా వీక్షించి, లైక్‌లు చేశారు.

ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం అంటే ఏమిటో ఈ కోతి మనకు నేర్పిందని కామెంట్ చేశారు. ఈ రోజుల్లో ప్రజలు ఒకరికొకరు దూరమవుతున్నారు.. ప్రేమకు భాష, హద్దులు లేవని ఈ వీడియో నిరూపిస్తుందని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy