Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్

జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల కోసమే కొన్ని ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తారు. అవి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతాయి. మరికొన్ని మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో నిర్వహిస్తారు.

అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ పోటీలు.. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నట్లు ఉంటాయి. కానీ చాలా కష్టంతో కూడుకుని ఉంటాయి. అంతేకాదు చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆ పోటీల్లో ఎలాగైనా గెలిచి.. బహుమతి అందుకోవాలనే లక్ష్యంతో వారంతా పట్టుదలతో ఉంటారు. అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇలా ఉంది.. అరటి బోదెను భూమిలో బాగా లోతుగా పాతారు. ఆ బోదె కొన భాగంలో కర్రకు మాజా కూల్‌డ్రింక్ బాటిల్‌ కట్టి ఉంచారు.

ఆ బోదెను ఎక్కి కూల్‌డ్రింక్ బాటిల్ అందుకోవడమే లక్ష్యమని వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ బోదె చుట్టూ గ్రామస్థులు కొంత దూరంగా నిలిచి ఉన్నారు. అంతలో ఓ చిన్న పిల్లాడు పరిగెత్తుకొంటూ వచ్చి అరటి బోదెను ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కొంత దూరం ఎక్కి.. చివరకు కిందికి దిగిపోయాడు. మరో పిల్లాడు పరిగెత్తుకొంటూ వచ్చి.. అరటి బోదెను కొంత దూరం ఎక్కాడు. ఆ తర్వాత పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నించి.. బోదెపైన కర్రకు కట్టి ఉంచిన కూల్‌డ్రింక్ బాటిల్‌ అందుకున్నాడు.

కర్రతో సహా కూల్‌డ్రింక్ బాటిల్ తీసుకుని అరటి బోదెపై నుంచి కిందకి జారుకుంటూ దిగిపోయాడు. అక్కడ ఉన్నవారంతా ఈ పిల్లలను చప్పట్లతో వారు ఉత్సాహపరిచారు. ఈ మొత్తాన్ని అక్కడి వారి తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోను rajabali.sk.5076 ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అరటి బోదె చాలా నునుపుగా ఉంటుందని.. దీనిపైకి పాక్కుంటూ ఎక్కడం చాలా కష్టమన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడంటూ ఆ పిల్లాడిపై వారు ప్రశంసలు కురిపించారు. చిన్న పిల్లలకు ఇలాంటి పోటీ పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి క్రీడాకారులు అవుతారని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy