Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.. జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు..

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.. జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు..

దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సామాన్య ప్రజలతో పాటు సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మధ్యాహ్నంలోగా పరిస్థితి సరిదిద్దకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు (Delhi Metro).

సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను కారణంగా చూపుతూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) వరుసగా రెండో రోజు కూడా 16 మెట్రో స్టేషన్లను మూసివేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో స్టేషన్ల మూసివేత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ బార్ అసోసియేషన్ ఓ పిటిషన్ వేసింది. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. మధ్యాహ్నం వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొన్నారు (Supreme Court on Delhi Metro closure).

ఇదిలా ఉండగా, నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు (CJP protest at Jantar Mantar). ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పార్లమెంట్‌ను కూడా ఈ లీకేజీ వ్యవహరం కుదిపేస్తోంది. అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నిరసనలతో సభ పలుసార్లు వాయిదా పడింది.

/span>

నెతన్యాహు ఓ వార్ క్రిమినల్.. అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి: న్యూయార్క్ మేయర్

పసిడి ధరలు మరికొంత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy