ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ, ఆయనను అరెస్ట్ చేసే చట్టపరమైన అధికారం తనకు లేదని న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) స్పష్టం చేశారు.
నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్ట్ చేయిస్తానని గతంలో ప్రకటించిన మమ్దానీ, ఇప్పుడు అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యం కాదని అంగీకరించారు.
'ఐసీసీ అరెస్ట్ వారెంట్‌ను అమలు చేసే అధికారం న్యూయార్క్ నగరానికి లేదా మేయర్ కార్యాలయానికి లేదు. వార్ క్రిమినల్ అయిన నెతన్యాహును మేం అరెస్ట్ చేయలేం. అయితే అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలి' అని మమ్దానీ డిమాండ్ చేశారు (Benjamin Netanyahu Arrest).
2024లో గాజా యుద్ధానికి సంబంధించిన యుద్ధ నేరాల ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది (International Criminal Court). అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను ఖండించింది. ఐసీసీ అధికార పరిధిని అంగీకరించ లేదు. ఈ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో స్పందించారు. 'నెతన్యాహు అమెరికాలో ఉన్నంత వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అరెస్ట్ కారు' అని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:

