Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

తిరుపతి, మే8 (ఆంధ్రజ్యోతి): వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ (AP Minister Satya Kumar) విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.

అవినీతి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతోనే డీఎంకే కొంపముంచాయని చెప్పుకొచ్చారు. ఈరోజు (శుక్రవారం) తిరుపతి తాతయ్య గుంట గంగమ్మను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు.

అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోందని తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును డీఎంకే వ్యతిరేకించడంతో ఓటమి పాలయిందని తెలిపారు. ఆయా పార్టీల మెజారిటీ ఆధారంగా తమిళనాడు గవర్నర్ నిర్ణయం తీసుంటారని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy