Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎబోలా వైరస్‌.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ఎబోలా వైరస్‌.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్‌పై ఆందోళన పెరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్‌గా భావిస్తున్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రారంభంలో దీని లక్షణాలు సాధారణ జ్వరంలా కనిపించడంతో చాలా మంది నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. అయితే సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎబోలా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

ఎబోలా వైరస్ ప్రారంభ లక్షణాలు

ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఎబోలా వైరస్ ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ ఫీవర్‌లా ఉంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

  • అధిక జ్వరం

  • తీవ్రమైన తలనొప్పి

  • ఒళ్ళు, కండరాల నొప్పులు

  • తీవ్రమైన అలసట, నీరసం

  • గొంతు నొప్పి

  • వాంతులు, విరేచనాలు

  • కడుపు నొప్పి

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది.

ఎబోలా వైరస్ నుంచి ఎలా రక్షించుకోవాలి?

  • ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.

  • మాస్క్‌లు, గ్లవ్స్ వంటివి ఉపయోగించాలి.

  • తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

  • శానిటైజర్ ఉపయోగించే అలవాటు చేసుకోవాలి.

  • లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

  • సోకిన వ్యక్తిని ఇతరుల నుంచి వేరుగా ఉంచాలి.

విదేశాల నుంచి వచ్చిన వారు జాగ్రత్త

ఎబోలా కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చిన వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, అలసట లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అవగాహనతో ముందుజాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


ఎన్‌టీఏ గుణపాఠం నేర్వకపోవడం విచారకరం.. 'నీట్' లీక్ కేసుపై సుప్రీం కోర్టు

30 వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కు గుండెపోటు..

For More Latest News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy