Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎడారినాట కాపుల బాట.. దుబాయిలో ముద్రగడకు నివాళి

ఎడారినాట కాపుల బాట.. దుబాయిలో ముద్రగడకు నివాళి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: రాజకీయ సమీకరణలు, వ్యాపార అవకాశాలలో ఇంటాబయటా కాపులు పరస్పర వైరుధ్య వైఖరులు అవలంబించినా తమ సామాజికవర్గం విషయం వచ్చే సరికి అన్నీ మరచి ఐకమత్యంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.

గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్రులలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నప్పటికీ విభిన్న ప్రాంతాలలో వేర్వేరుగా చెల్లాచెదురుగా ఉంటున్న కాపులు ఆత్మీయంగా స్పందిస్తారు. దుబాయిలోని కాపు సంఘం ఈ విషయంలో ముందుంటుంది. ఇటీవల మరణించిన తమ దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభకు రాజకీయాలకు అతీతంగా కాపులలో అత్యధికులు హాజరై నివాళులు ఆర్పించి తమ మహానేతను స్మరించుకున్నారు.

దుబాయిలోని యునైటెడ్ కాపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు రాజకీయాలకు అతీతంగా కాపు ప్రముఖులందరు హాజరయ్యారు. తాడేపల్లి శాసన సభ్యుడు, జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని ముద్రగడ ప్రజా సేవను గుర్తు చేసుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

దుబాయ్‌లో అత్యున్నత భారతీయ అధికారిగా విష్ణువర్ధన్ రెడ్డి

తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలి: మంత్రి సీతక్క

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy