Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలి: మంత్రి సీతక్క

తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలి: మంత్రి సీతక్క

ఇంటర్నెట్ డెస్క్: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ స్ఫూర్తితో ప్రవాసులు తెలంగాణ గ్రామీణాభివృద్ధికి సహకరించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు.

కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లో ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.

సీఎం కృషికి చేయూతగా ప్రవాసులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, ఉపకారవేతనాలు, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఢిల్లీలో సీజేపీ విద్యార్థులకు మద్దతుగా రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నానికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, ఓవర్‌సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు సందీప్ వంగల, నెమలి మాధవ, శ్రీనివాస్ రామసహాయం, గూడూరు రవీందర్ రెడ్డి, గీతా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఛార్లెట్‌లో తానా ఆదర్శవంతమైన సేవ.. రక్తదానం చేసిన సభ్యులు

కువైత్‌లో ఏపీఎన్నార్టీ ఆధ్వర్యంలో 'సర్' అవగాహన సదస్సు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy