Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ ఆహార పదార్థాలను మిక్సర్‌లో వేయకండి.!

ఈ ఆహార పదార్థాలను మిక్సర్‌లో వేయకండి.!

ఇంటర్నెట్ డెస్క్: వంటగదిలో మిక్సర్ గ్రైండర్ ఎంతో ఉపయోగకరమైన పరికరం. చట్నీలు, మసాలా పొడులు, జ్యూస్‌లు తయారు చేయడం వంటి అనేక పనులను సులభంగా పూర్తి చేస్తుంది.

అయితే ప్రతి ఆహార పదార్థాన్ని మిక్సర్‌లో వేయడం మంచిది కాదు. కొన్ని వస్తువులను మిక్సర్‌లో వేయడం వల్ల బ్లేడ్లు, మోటార్ దెబ్బతిని, మిక్సర్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే మిక్సర్ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

వేడి ఆహార పదార్థాలు

వేడిగా ఉన్న కూరలు, సూప్ లేదా ఉడికించిన కూరగాయలను వెంటనే మిక్సర్‌లో వేయకండి. వేడి వల్ల జార్‌లో ఒత్తిడి పెరిగి మూత ఒక్కసారిగా తెరుచుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే జార్, మోటార్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి.

ఎక్కువ ఐస్ క్యూబ్స్

జ్యూస్ లేదా షేక్స్ తయారు చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఐస్ క్యూబ్స్ వేయడం మంచిది కాదు. దీంతో బ్లేడ్లపై అధిక ఒత్తిడి పడటమే కాకుండా, మోటార్‌పై కూడా భారం పెరుగుతుంది.

గట్టి మసాలా దినుసులు

పసుపు కొమ్ములు, జాజికాయ, దాల్చినచెక్క వంటి గట్టి మసాలా దినుసులను ఒకేసారి మిక్సీలో గ్రైండ్ చేయకూడదు. ఎక్కువగా రుబ్బడం వల్ల బ్లేడ్లు మొద్దుబారవచ్చు. మోటార్‌పై కూడా అదనపు ఒత్తిడి పడుతుంది. అవసరమైతే చిన్న చిన్న ముక్కలుగా చేసి, కొద్దికొద్దిగా మిక్సీ పట్టడం మంచిది.

పొడి పదార్థాలు, ధాన్యాలు

బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను నీరు లేకుండా ఎక్కువ పరిమాణంలో రుబ్బడం, అలాగే బియ్యం, గోధుమలు, జొన్నలు వంటి ధాన్యాలను ఒకేసారి ఎక్కువగా వేయడం వల్ల మోటార్‌పై అధిక భారం పడుతుంది. దీంతో మిక్సర్ పనితీరు తగ్గి, త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం

మిక్సర్ జార్‌ను ఎప్పుడూ సామర్థ్యానికి మించి నింపకూడదు. ఎక్కువ ఆహార పదార్థాలు వేయడం వల్ల మోటార్‌పై ఒత్తిడి పెరిగి, బ్లేడ్లు సరిగా తిరగవు. దీంతో మిక్సర్ పనితీరు తగ్గడమే కాకుండా, దాని జీవితకాలం కూడా తగ్గుతుంది. కాబట్టి, తయారీ సంస్థ సూచించిన పరిమితిలోనే పదార్థాలను వేసి ఉపయోగించడం మంచిది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

మొక్కలాంటి నత్త!

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి.. ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy