పుట్టపర్తి, మే 15 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ లక్ష్యాలను చేరడమే కాదని.. లక్ష్యాలను ఛేదిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు.
రక్షణ రంగంలో భారత్ బలోపేతానికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చేపడుతున్న AMCA ప్రోగ్రామ్ ఫెసిలిటీ కేంద్రం రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి అని అభివర్ణించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి ఈరోజు ఏఎంసీఏ ప్రాజెక్టు శుంకుస్థాపనకు హాజరయ్యానని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో స్వదేశీ రక్షణ సాంకేతికతల్లో భారత్ వేగంగా ముందుకు వెళ్తోందని ఉద్ఘాటించారు. స్టెల్త్ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్ అవియానిక్స్, సమగ్ర యుద్ధ విమాన సాంకేతికతలో ఏఎంసీఏ ప్రోగ్రామ్ కీలకమని వ్యాఖ్యానించారు. ఈరోజు రాయలసీమలో కీలక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో 9 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. వ్యూహాత్మక తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
.
వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. క్షేత్రస్థాయిలో కార్యాచరణ
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News

