ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేయడం చాలా కష్టం.
ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు వేడితో మరింత ఇబ్బందులు పడతారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు అద్భుతమైన పరిష్కారం కనిపెట్టాడు. అతడి ట్రిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Scooter AC jugaad).
ఆ వీడియోలోని యువకుడు కేవలం రూ.1500 ఖర్చుతోనే స్కూటీ నుంచి చల్లదనం వచ్చేలా ఏర్పాటు చేశాడు. తన స్కూటీ హ్యాండిల్ దగ్గర ఒక వాటర్ బాటిల్, ఒక చిన్న పంపు, ఒక నాజిల్‌ను అమర్చాడు. స్కూటీ స్టార్ట్ చేసిన వెంటనే చిన్న మోటార్ ద్వారా నీరు నాజిల్‌కి చేరి చల్లటి నీటి తుంపర్లు బయటకు వస్తున్నాయి. ప్రయాణించే సమయంలో ఈ నీటి తుంపర్లు గాలితో కలిసి మొహానికి కాస్త చల్లదనాన్ని అందిస్తున్నాయి. ఈ పద్ధతిని 'ఎవాపరేటివ్ కూలింగ్ టెక్నిక్' అని సోషల్ మీడియా జనాలు పిలుస్తున్నారు (Desi AC scooter).
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral bike hack). 'ఇండియన్స్ జుగాడ్‌కు సాటి లేదు', 'ఇదే అసలైన ఆవిష్కరణ' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే దీనికి పేటెంట్ తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. మరికొంతమంది మాత్రం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుగా వైరింగ్ చేస్తే స్కూటీ ఎలక్ట్రికల్ సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉందని, నీటి తుంపర్లు కళ్లలో పడితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

