Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ

హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) చైర్మన్ సంతోశ్ కుమార్ యాదవ్‌తో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఈరోజు (ఆదివారం) సమావేశం అయ్యారు.

ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రి చర్చించారు. హైదరాబాద్‌లో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులపై మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్ పనులు త్వరగా ప్రారంభించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ - విజయవాడ NH-65ను 8 లేన్ల విస్తరణపై చర్చించారు.

డెత్ రోడ్‌గా మారిన NH-65పై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ఎల్బీనగర్ - హయత్‌నగర్ మధ్య 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించినట్లు వివరించారు. నాగపూర్ తరహాలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని కోరారు. ఇప్పటికే డీపీఆర్‌ని MoRTHకు పంపినట్లు వెల్లడించారు. RRR, NH-65 టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు సంతోశ్ కుమార్ యాదవ్‌ తెలిపారు. మంత్రి కోమటిరెడ్డితో పాటు స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్ సహా ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy